నటీనటులు : శ్రేయాన్ ,ప్రగతి ,ముఖేష్ రుషి ,కోట ,అభిమన్యు సింగ్ ,అలీ తదితరులు
సంగీతం : ప్రవీణ్
ఛాయాగ్రహణం : వీకే గుణశేఖర్
నిర్మాత: వాసు మంతెన
దర్శకత్వం : వాసు మంతెన
రేటింగ్ : 2/ 5
సహజనటి జయసుధ వారసుడు శ్రేయాన్ ని హీరోగా పరిచయం చేస్తూ దర్శక నిర్మాత వాసు మంతెన తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ''బస్తీ ''. ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ బస్తీ ఈరోజు భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది . మరి ఈ బస్తీ చిత్రం బస్తీ జనాలను అలరించేలా రూపొందిందా లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్ళాల్సిందే .
కథ :హైదరాబాద్ లోని రెండు వైరి వర్గాలైన అమ్మిరాజు (ముఖేష్ రుషి )బిక్షపతి (కోట శ్రీనివాసరావు )లు నిత్యం వర్గపోరుతో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు . అయితే కాలక్రమంలో వర్గపోరు కి స్వస్తి చెప్పి ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నప్పటికి బిక్షపతి కొడుకు భవాని (అభిమన్యు సింగ్ ) మాత్రం ఇరు వర్గాల మద్య నిప్పు రాజేయడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు . దాంతో భవానికి బుద్ది చెప్పాలని భావించిన అమ్మిరాజు భవాని చెల్లెలు స్రవంతి (ప్రగతి ) ని కిడ్నాప్ చేయిస్తాడు . అదే సమయంలో అమెరికా నుండి విజయ్ (శ్రేయాన్ ) తన ఇంటికి వస్తాడు . అక్కడ తన ఇంట్లో ఉన్న స్రవంతి ని చూసి ప్రేమలో పడతాడు . అయితే విజయ్ ప్రేమని వ్యతిరేకించిన భవాని అమ్మిరాజు ని చంపేసి విజయ్ ని అలాగే తన చెల్లెలిని కూడా చంపాలనుకుంటాడు . భవాని నుండి తన లవర్ ని ఎలా కాపాడుకున్నాడు చివరికి ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .
నటీనటుల ప్రతిభ :సహజనటి జయసుధ వారసుడు అనగానే సహజంగానే నటన అనేది వాళ్ళ రక్తంలోనే ఉంది అని అనుకుంటారు కానీ శ్రేయాన్ విషయానికి వస్తే ఒడ్డూ పొడవు ఉన్నప్పటికీ నటనలో శ్రేయాన్ మరిన్ని మెలకువలను నేర్చుకోవాల్సిఉంది అని స్పష్టం అయ్యింది ఈ బస్తీ తో . నటన లో మరింతగా రాటుదేలితే ఖచ్చితంగా టాలీవుడ్ కు మరో మంచి నటుడు దొరికినట్లే !జయసుధ తనయుడు కాబట్టి నటన విషయంలో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాటిని రీచ్ కావడంలో మాత్రం శ్రేయాన్ విఫలం అయ్యాడు . ఇక హీరోయిన్ గా పరిచయం అయిన ప్రగతి బాగానే నటించింది . మిగతా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు నటించారు .
హైలెట్స్ :పాటలు
ఛాయాగ్రహణం
డ్రా బ్యాక్స్ :
కథ
కథనం
దర్శకత్వం
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
సాంకేతిక వర్గం :ఈ విభాగంలో హైలెట్ గుణశేఖర్ అందించిన ఫోటోగ్రఫీ, ఇక ప్రవీణ్ అందించిన పాటలు కూడా బాగున్నాయి . అయితే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మరీ పేలవంగా ఉంది . నిర్మాణ విలువలు బాగున్నాయి కానీ తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న వాసు మంతెన సరైన కథ ,కథనం ఎన్నుకోకుండా సాదా సీదాగా నడిపించడంతో మొదటి భాగం కొంతవరకు ఆకట్టుకునే విధంగా సాగినప్పటికీ ద్వితీయర్డం పేలవంగా సాగడంతో ప్రేక్షకులు బోర్ ఫీలౌతారు . అయితే కొత్త దర్శకుడే అయినప్పటికీ మొదటి భాగంలో కొన్ని కొన్ని సన్నివేశాలను డీల్ చేసిన విధానం బాగుంది .
విశ్లేషణ :ప్రేమకథా చిత్రం అయినప్పటికీ కథ ,కథనం పాతది కావడం,ప్రత్యేకమైన ట్విస్ట్ లంటూ ఏమి లేకపోవడంతో ఈ చిత్రం కనీసం యూత్ నైనా టార్గెట్ చేస్తుంది అని భావించినప్పటికీ వాళ్ళను రీచ్ కావడం కూడా కష్టమే .
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.